ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం..

ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం

Advertisements

<p>కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధమైంది&period; కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానంతో చర్చలు జరిపారు&period; రాహుల్ గాంధీ&comma; మల్లికార్జున ఖర్గేలతో సిద్ధరామయ్య&comma; డీకేలు భేటీ అయ్యారు&period; ఈ క్రమంలో నేడు సీఎంతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి&period; ఇప్పటికే తొలి విడతలో ఎవరు ఉంటారనేది ఖరారైనట్టు వెల్లడించాయి&period; మరో వారం పది రోజుల వ్యవధిలోనే క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే&comma; అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు హాజరుకానున్నారు&period; సాయంత్రం 4&colon;05 గంటలకు కర్ణాటక శాసనసభ ప్రాంగణంలో లేదా లోక్ భవన్‌లో ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరగనుంది&period; ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు&comma; ట్రాఫిక్ నియంత్రణ&comma; కార్యక్రమం సజావుగా సాగేలా చూడటం కోసం కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది&period; జూన్ 3à°¨ విధాన సౌధ&comma; వికాస సౌధ&comma; బహుళ అంతస్తుల భవనాలలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు&comma; సిబ్బందికి హాఫ్ డే సెలవు ప్రకటిస్తూ గవర్నర్ పేరు మీద సిబ్బంది&comma; పరిపాలనా సంస్కరణల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.