జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా నీ దారే నీ కథ టీజర్ లాంచ్ ఈవెంట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు మరియు క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ గారు చేతుల మీదుగా చాలా ఘనంగా జరిగింది. మొత్తం కొత్త టీం తో ఈ ఈవెంట్ ని ఇన్నోవేటివ్ గా కొత్తగా చేశారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో మొత్తం కొత్త వాళ్ళతో ఈ సినిమా యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నిర్మాత తేజేష్ మాట్లాడుతూ : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీ మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు మొదటి సినిమా అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నా ప్రింట్ మరియు టెలివిజన్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారికి మరియు క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ గారికి మరియు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
నిర్మాత శైలజ జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ : సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించాం. మంచి టెక్నికల్ వాల్యూస్ తో మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. బుడాపెస్ట్ లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ హాలీవుడ్ నుంచి అలెగ్జాండర్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా గతంలో మిషన్ ఇంపాజిబుల్, పరసైట్, స్క్విడ్ గేమ్ వంటి చిత్రాలకు ఆర్కెస్ట్రా అందించిన టీం అదేవిధంగా బాలీవుడ్ కి సంబంధించిన మ్యూజిషియన్స్ తో చాలా గ్రాండ్ గా చేసాం. మీడియా మరియు ప్రేక్షకులు మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమాను మన సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత మరియు దర్శకుడు వంశీ జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ : నేను న్యూయార్క్ లో డైరెక్షన్ గురించి చదువుకొని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని మన నేటివిటీకి తగినట్టుగా తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఎంతోమంది సింక్ సౌండ్ రిస్క్ అంటున్న సింక్ సౌండ్ తోనే ఎగ్జిక్యూట్ చేసి హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గకుండా చేయడమైనది. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మ్యూజిక్ డిజైన్ చేయించాం. మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది అన్నారు.
నటీనటులు :
ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.
టెక్నికల్ టీం :
బ్యానర్ : జె వి క్రియేషన్స్
నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ
రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ
సంగీతం : ఆల్బర్ట్టో గురియోలి
కాస్ట్యూమ్ డిజైనర్ : హర్షిత తోట
ఎడిటర్ : విపిన్ సామ్యూల్
దర్శకుడు : వంశీ జొన్నలగడ్డ
పి ఆర్ : ఓ మధు VR
ఇది చదవండి: అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి