ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె కృష్ణాజిల్లాలో మూడవ రోజుకి చేరింది. సమ్మెలో భాగంగా విధులకు గైర్హాజరైన అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ధర్నా చౌక్ లో మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మీడియాతో మాట్లాడుతూ… అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేల రూపాయలు అదనంగా పెరిగిన ధరలకు అనుకూలంగా ఈ రోజు మేము వేతనాన్ని పెంచమని అడుగుతున్నాము. పదివేలు వేతనంతో ఒక కుటుంబం బతకాలంటే చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి వేతనం పెంచాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అలాగే సెల్ ఫోన్లు ఇచ్చారు సపోర్ట్ చేయని సిమ్ములు ఇచ్చారు. మరి డ్యూటీల కెళ్ళి అప్లోడ్ చేసిన ఫోటోలు మాకు కావాలి అని చెప్తున్నారు. మేం పనికి వ్యతిరేకం కాదు కానీ వాళ్ళు మాకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా, ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.. కాబట్టి ఈరోజు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అధికారులు వేధింపులతో పాటు ప్రజాప్రతినిధులు వేధింపులు కూడా మాకు ఎక్కువైపోయాయి. మా యొక్క డిమాండ్ న్యాయపరమైనది వెంటనే పరిష్కరించాలి. అధికారుల వత్తిడి వల్ల ఆశ వర్కర్ చనిపోయిన పరిస్థితి ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వెంటనే పరిష్కరించాలి అలాగే చనిపోయిన ఆశ వర్కర్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదని, కనీసం మట్టి ఖర్చులు కూడా అందరు చందాలు వేసుకుని మరి కార్యక్రమాలు చేయవలసిన దుస్థితికి దిగజారిపోయింది. సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి….
87
previous post