కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతున్న బజాజ్ పల్సర్(Bajaj Pulsar) ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో మార్కెట్ లోకి వచ్చింది. 2024 బజాజ్ పల్సర్ ఎన్250(Bajaj Pulsar N250) పేరుతో వచ్చిన ఈ బైక్ లో పలు కొత్త ఫీచర్లు యాడ్ చేశారు. లుక్ పరంగా పాత మోడల్ లోనే ఉంచినప్పటికీ టెక్నీకల్ గా అద్భుతమైన ఫీచర్స్ తో లాంచ్ చేశారు. దీనికి ముందువైపు రెండు డీఆర్ఎల్ లతో సింగిల్ హెడ్ లైట్ ఉంటుంది. మోటార్‌సైకిల్ ట్యాంక్ ఎక్స్ టెన్షన్లు, అండర్బెల్లీ ఫెయిరింగ్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్‌తో పాటు దాని ట్యాంక్ డిజైన్ అలాగే ఉంది. ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో కలిగి ఉంటుంది.
ఇది చదవండి: ChatGPT | చాట్‌జీపీటీ అకౌంట్ తో వాడుతున్నారా.. అయితే ఎప్పుడు అవసరం లేదు..!
బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఫ్రంట్ టైరులో ఎటువంటి మార్పు లేదు కానీ 140-సెక్షన్ వెనుక టైర్ అమర్చారు. ఇందులో ఏబీఎస్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ అత్యంత అప్రమత్తంగా పనిచేస్తుంది. కొత్త పల్సర్ ఎన్ 250కి మూడు ఏబీఎస్ మోడ్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ స్టేటస్, లెఫ్ట్ స్విచ్ క్యూబ్ లోని బటన్ ను ఉపయోగించి కాల్స్ ను స్వీకరించడం లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ కొత్త బజాజ్ పల్సర్ ఎన్ 250 మరికొద్ది రోజుల్లో షోరూమ్ లకు రానుంది. మార్కెట్ లో ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో ఉన్న బైక్స్ కి ఈ కొత్త పల్సర్ ఎన్ 250 గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.