సింగరేణి ఇల్లందు క్లబ్ లో నూతన సంవత్సరం 2024 వేడుకలు మంచిర్యాల జిల్లా మందమర్రి, సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏరియా జియం A. మనోహర్ సవిత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ముందుగా సింగరేణి కార్మికులకు, అధికారులకు, ఉన్నతాధికారులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి నృత్యాలు చేస్తూ ఆనంద ఉత్సాహాల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 31 గతంలోని బాధలను మరచిపోయి, కొత్త సంవత్సరంలో వాటి గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో మన జీవితాలను, కాపాడుకోవాలి, మనం మంచి అలవాట్లను మరియు మన నూతన విజయాన్ని పునరుద్ధరించుకుందాం. గత సంవత్సరం నిరాశాజనకంగా చెడుగా ఉంటే, కొత్త సంవత్సరం ఆశాజనకంగా క్రొత్తగా ఉండాలని కోనియాడారు.
100
previous post