మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కు మెజారిటీ సభ్యుల సంఖ్యా బలం ఉండడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమైంది. దీంతో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్ తమ పదవులకు రాజీనామాలు సమర్పిండంతో అవిశ్వాస తీర్మానం లాంఛనమే కానుంది. చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ అవి ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో ప్రత్యేక సమావేశాన్ని యథావిధిగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా క్యాంపు ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు రెండు రోజుల కింద హైదరాబాద్‌లోని క్యాంపుకు తరలివెళ్లారు. అవిశ్వాస తీర్మానం కోసం నేరుగా మున్సిపల్ సమావేశానికి హాజరై అవిశ్వాసానికి మద్దతు తెతియజేస్తున్నారు. కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో చైర్మన్‌గా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్‌గా చల్లా నరేశ్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం…
70
previous post