చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ ఆదివారం మధ్యాహ్నం స్థానిక ప్రైవేటు కల్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించగా, సుమారు 4000 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ,,, 1983 లో కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి టిడిపికి ఎనలేని సేవలు అందించానని 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున నేను, వైసీపీ తరఫున అమర్నాథ్ రెడ్డి పోటీ చేయగా స్వల్ప మెజారిటీ కారణంగా ఓడిపోయానని తిరిగి 2019 ఎన్నికల్లో టిడిపి ఆదేశాల మేరకు అమర్నాథ్ రెడ్డికి సహకారాలు అందించానన్నారు, కానీ టిడిపి అధిష్టానం స్థానిక నాయకులు నా కష్టాన్ని విస్మరించారని, నేను ఆర్థికంగా చితికిపోయిన పదవులు రాకపోయినా ఏనాడు, నిరుత్సాహపడకుండా పార్టీ కోసం కష్టపడిన ఫలితం లేదని, ఏ పార్టీలో చేరతారని విలేకరులు ప్రశ్నించగా, అభిమానులు మరియు ప్రజలతో చర్చించి ఏ పార్టీలో చేరుతానోనని తెలుపుతామన్నారు, కాగా సుభాష్ చంద్రబోస్ టిడిపి పార్టీ వీడితే కచ్చితంగా వైసీపీ పార్టీకి లాభం చేకూరుతుందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
పార్టీ కోసం ఎంత కష్టపడినా ఫలితం లేదు….
65
previous post