65
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నటసార్వభౌమ అన్నా నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా పెద్దకూరపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో అమర జ్యోతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీధర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. కార్యకర్తలతో పెదకూరపాడు నుండి లింగంగుంట్ల గ్రామం మీదుగా పొడపాడు, ముస్సాపురం గ్రామం వరకు ద్విచక్ర వాహనాలతో అమరజ్యోతి ర్యాలీ నిర్వహించారు. ముస్సాపురంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నూతన ఎన్టీఆర్ విగ్రహన్ని కొమ్మాలపాటి శ్రీధర్ ఆవిష్కరించారు.