ఓ అన్నా..తంబి…రా ఆడుదాం

Parthasarathy who unveiled the national flag

Advertisements

&NewLine;<p>గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసే ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు&period; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు&period; ఈ క్రీడలను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షురాలు పద్మావతి&comma; ఆర్డీవో రాజు&comma; తాడిగడప మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు&period; ఎమ్మెల్యే కోలుసు పార్థసారథి జాతీయ జెండాను ఆవిష్కరించి ఆడుదాం ఆంధ్ర తాడిగడప మున్సిపాలిటీ స్థాయి క్రీడలను ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఆడుకుందాం ఆంధ్రా లాంటి కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని వీలుందన్నారు&period; క్రీడల వల్ల మానసికోల్లాసంతో పాటు గెలుపోటములను ఒకే విధంగా తీసుకునే లక్షణం అలవడుతుందని నేటి యువత సెల్ఫోన్లకు&comma; కంప్యూటర్లకు అతుక్కుపోయి శారీరిక శ్రమను విస్మరిస్తున్నారని దీనివల్ల యువతలో పోరాట స్ఫూర్తి కొరవడుతుందన్నారు&period; ఆడుదాం ఆంధ్రను ప్రతి ఒక్కరు ప్రోత్సహించి విజయవంతం చేయాలని సారధి కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..