సింగరేణిలో కొనసాగుతున్న ఎన్నికలు

Ongoing elections in Singareni

Advertisements

&NewLine;<p>సింగరేణి ఎన్నికలు కొనసాగుతున్నాయి&period; సింగరేణిలో మొదటిసారిగా 1998 సంవత్సరంలో కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి&period; అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరగగా అందులో ఏఐటీయూసీ మూడు సార్లు&comma; ఐఎన్టీయూసీ ఒకసారి&comma; టీబీజీకేఎస్ రెండు సార్లు గెలిచి అధికార హోదాను అనుభవించాయి&period; ఏడో దఫా జరిగే 2023 ఎన్నికల్లో 14 సంఘాలు పోటీ చేయాల్సి ఉన్నా 13 సంఘాలు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశాయి&period; ఏడో దఫా ఎన్నికలు&comma; ఇందు కోసం సింగరేణి అధికార యంత్రాంగం&comma; కార్మిక శాఖ సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది&period; తెలంగాణ లోని 6 జిల్లాల పరిధిలో ఉన్న 11 డివిజన్ లలో&comma; 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా&comma;12 ఓట్ల లెక్కింపు కేంద్రాలను&comma;440 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించెందుకు సింగరేణి యాజమాన్యం పూర్తిగా ఏర్పాట్లు చేసింది&period; సింగరేణి విస్తరించి ఉన్న 11 ఏరియాలలో సింగరేణి సంస్థలో 50&comma;500 కార్మికులు ఉన్నా 39&comma;748 మంది కార్మిక ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు&period; ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి&comma; కొత్తగూడెం&comma; ఇల్లందు&comma; మణుగూరు లలోని 16 పోలింగ్ కేంద్రాలలో 5387 మంది సింగరేణి కార్మిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు&period; ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం&comma; కొత్తగూడెం జిల్లాలో నాలుగు ఏరియాల్లో మొత్తం 16 పోలింగ్ కేంద్రాలను ఏరియా కి ఒకటి చొప్పున నాలుగు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు&period; ఖమ్మం జిల్లాలోని జేవీఆర్&comma; కిష్టారం ఓసీలలో మొత్తం మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలో 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు&period; కొత్తగూడెం ఏరియాలో 6&comma;ఇల్లెందు ఏరియాలో 3&comma; మణుగూరు ఏరియాలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు&period; ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది&period; రాత్రి ఏడు గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది&period; ఓట్ల లెక్కింపుకు 200 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు&period; సింగరేణి ఎన్నికలను బ్యాలెట్ పద్దతిన నిర్వహించేందుకు కార్మిక శాఖ సంసిద్దమవుతోంది&period; అయితే ఎన్నికల నిర్వహణ&comma; ఫలితాల వెల్లడి ఒకే రోజు కావడంతో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు