పల్నాడులో జరుగుతున్న మేమంతా సిద్ధం సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి వైసీపీ పార్టీలో చేరారు. గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ నుండి 2004 లో మరియు 2009 లో పి గన్నవరం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాముల రాజేశ్వరి దేవి. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా పనిచేశారు. తదనంతరం జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసిపి పార్టీ నుండి 2014 లో టికెట్ ఆశించి, కానీ టికెట్ రాకపోవడంతో జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పి గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. 2019 తర్వాత జనసేన పార్టీని కూడా వీడీ రాజకీయాలకు దూరంగా ఉన్న రాజేశ్వరి దేవి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
జగన్ సమక్షంలో… వైసీపీలో చేరిన పాముల రాజేశ్వరి
102
previous post