రాబోవు ఎన్నికలు నేపథ్యంలో విజయవాడ కమీషనర్ ఆఫ్ పోలీసు వారి ఆదేశాల మేరకు ఏసీపీ రవి కిరణ్ ఆధ్వర్యంలో నందిగామ పట్టణంలోని ముక్కపాటి కాలనీ వద్ద నుండి రైతు పేట ఎన్టీఆర్ రోడ్డు సీఎం రోడ్డు నెహ్రు నగర్ చందాపురం రోడ్డు గాంధీ సెంటర్ వరకు వరకు ప్రధాన రహదారుల గుండా పోలీసులు,పారా మిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్(కవాతు) నిర్వహించారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగిందని ఏసిపి రవి కిరణ్ తెలియజేసారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఏసిపి తెలిపారు. నియోజకవర్గంలో 18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అక్కడ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తామని అదే విధంగా నియోజకవర్గంలో అన్నిచోట్ల భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాలుగా ముందు నుంచే చర్యలు తీసుకుంటామని ఏసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ సబ్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. నందిగామ సిఐ హనీష్ కంచికచర్ల రూరల్ సిఐ చంద్రశేఖర్ నందిగామ ఎస్సైలు చందర్లపాడు కంచికచర్ల వీర్లపాడు నందిగామ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు, పారామిలిటరీ బలగాల కవాతు…
116
previous post