రహదారుల నిర్మాణంలో నూతన టెక్నాలజితో తిరుపతి నవోదయ కాలనీలో నిర్మిస్తున్న పరం ఫేవర్స్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, తిరుపతి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ నవోదయ కాలనీలో 330 మీటర్ల పొడవుతో ఆధునిక నూతన టెక్నాలజీతో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. పరంఫేవర్స్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ రోడ్డుపై వర్షం నీరు నిలబడదని, మొత్తం నీరు రోడ్డు పీల్చుకోవడంతో సమీపా ప్రాంతాల్లో భూగర్భ జలాలు నిల్వ వుండేందుకు ఎక్కువ అవకాశం వుందన్నారు. ఈ నూతన టెక్నాలజీ 53 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు వలన పూర్తి ప్రయోజనం కలిగితే, మరిన్ని పరంఫేవర్స్ రహదారుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. తిరుపతి నియోజకవర్గం అభివృద్ధికి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను కౌన్సిల్ అనుమతితో చేపట్టడం జరుగుతుందన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేసారు. అనంతరం చెన్నారెడ్డి కాలనీలో నిర్మిస్తున్న రహదారిని, 35 వార్డు భవాని నగర్లో టీటీడీ పరిపాలనా భవనం ప్రక్కన రైల్వే కాలనీ వైపుకు వెలుతున్న రోడ్డు విస్తరణ, కాలువల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ సంజీవ్ కుమార్, టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంద్రారెడ్డి, మార్కెట్ ముని రామి రెడ్డి పాల్గొన్నారు.
నూతన టెక్నాలజీతో పరంఫేవర్స్ రోడ్డు – డిప్యూటీ మేయర్
63
previous post