Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్ప స్వామి వారు…

శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్ప స్వామి వారు…

by Prakash
Sri Thirumalanambi Chentaku Sri Malayappaswamy

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ‌నివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ తన్నీరముదు ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబి వారికి మేల్‌ చాట్‌ శేషవస్త్రాన్ని సమర్పించారు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ వేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్‌ రామానుజాచార్యులవారికి మేనమామ. ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల జీయంగార్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: