పట్టాభిరాం(Pattabhiram),
నర్సీపట్నంలో నిర్వహించిన టీడీపీ యువశక్తి(TDP Yuvashakti) కార్యక్రమం
కార్యక్రమంలో ప్రభుత్వ తీరును విమర్శించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
యువశక్తి(TDP Yuvashakti) కార్యక్రమం: మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో, అమలు కాని హామీలు ఇచ్చి, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి, జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు… ఆంద్రా అంటే ఇతర ప్రాంతాల వారు శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటున్నారు. జగన్ రెడ్డి చేసేది బస్సు యాత్ర కాదు తుస్సు యాత్ర. మద్యపాన నిషేదం హామీని తుంగలో తొక్కిన వ్యక్తి జగన్ రెడ్డి. లక్షా 50వేల కోట్ల మద్యంపై అమ్మకాలు చేసి, తాడేపల్లి కొంపకు కంటైనర్ కు వెళ్లాలి. చీప్ లిక్కర్ తాగి, ఎందర్నో పొట్టన పెట్టుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సింది యువత. శాండ్, వైన్, మైన్ కుంభకోణాలు అయిపోయాయి. ఇక ఉద్యోగాలపై పడ్డారు. ఎవరైనా ఇబ్బంది పడితే దొంగచాటుగా చూసి, నవ్వుకునే సైకో మన జగన్ రెడ్డి. పిల్ల సైకో.. సెల్ఫీ ఎమ్మెల్యే గణేష్.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈవాళ టార్చ్ లైట్ వెలుతురులో అపరేషన్లు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. తాండవ రిజర్వాయరు గేట్లు చిల్లు పడితే రూ. 8 లక్షలు ఖర్చు చేసి, మరమ్మతులు చేయలేని అసమర్థ ఎమ్మెల్యే. గంజాయి, రంగురాళ్లు, ఇసుక అక్రమ వ్యాపారాలు చేస్తున్నారా? పంచాయతీల నిధులను దోచేసిన గజదొంగ అనకాపల్లి ఎంపీకి ఉండటానికి అర్హుడా? ఎవరో విసిరిన రాయి ముఖ్యమంత్రి, ఊసరవెల్లి వెల్లంపల్లికి తగిలి ఎగిరిపోయిందట.. విజయవాడ సీపీ, రోజక్క కామెడీ ముందు పనిచేయదు. కోడికత్తి డ్రామా అయిపోయింది.. గులకరాయి డ్రామాను మొదలు పెట్టారు. భవిషత్తులో నేను., విజయ్ చట్ట సభల్లో అడుగు పెడతాం..
సీఎం రమేష్ మాట్లాడుతూ…
అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో అధికంగా యువత ఉన్నారు.. ఏపీలో ఉన్న డిస్టలరీలన్నీ జగన్ రెడ్డివే.. మైనింగ్, ఇసుక అన్నింటా దోబూచులాటే. ఇంట్లో కౌంటింగ్ మిషన్ పెట్టుకుని డబ్బులు లెక్కపెట్టుకునే వ్యక్తి జగన్ రెడ్డి. యువతకు ఉద్యోగాలిస్తే నాకు ఏమి వస్తాయి, గంజాయి, డ్రగ్స్ తాగిస్తే మాకు ఏమి వస్తాయనే ఆలోచనలో ఉన్న వ్యక్తి జగన్,. మా అన్నయ్యే మా నాన్నను చంపారని చెప్పినా జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. కోడికత్తి డ్రామా మాదిరి, రాయి డ్రామా మొదలు పెట్టారు. పోలీసు లేకుండా ఒక్క మీటింగు పెట్టు జగన్ రెడ్డి నీకు దమ్ముంటే చీకటిలో వెల్లంపల్లి, జగన్ రెడ్డిలిద్దరూ గీక్కున్నారు. సీపీ కాంతిరాణా డ్రామా మొదలెట్టారు. ఎవరో రాయి వేశారని చెప్పడం. నేను ఎంపీ అయితే హైడ్రోజన్ ప్లాంట్స్, మిధనాల్ ప్లాంట్స్ తీసుకొస్తాను. లమ్మసింగిలో పలు అభివ్రుద్ధి పనులు చేపట్టి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.
వంగవీటి రాదా(Vangaveeti Radha) మాట్లాడుతూ…
పేదల సంక్షేమం కోసం బటన్ నొక్కారంటున్నారు.. మీ కోసం ఎంత నొక్కుకున్నారు. మీ మీడియా సంస్థలకు ఎన్ని కోట్లు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని పరిపాలించడానికి పులులు, సింహాలు కాదు.. సమాన్యుడికి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. పులులు, సింహాలు వస్తే ప్రజలు తరిమి, తరిమి కొడతారు. ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే వ్యక్తి సీఎం రమేష్ మాత్రమే. ఎన్నో త్యాగాలు చేసిన పవన్ కల్యాణ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి. కూటమి విజయం ప్రజా విజయంగా చూపించాలి. జనం ముఖ్యమా? జగన్ రెడ్డి ముఖ్యమా? అనేది ఆలోచించాలి. చింతకాయల విజయ్ ఆన్ రాక్ ఉద్యోగం కోసం లక్షాన్నర వసూలు చేస్తున్నారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో అధికార పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించిన టీడీపీ నాయకులు విజయ్ ప్రధానితో సన్నిహిత సంబందాలున్న సీఎం రమేష్ ను గెలిపిస్తే, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. 2,300 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి, మచ్చలేని వ్యక్తిగా నిలిచిన నాయకుడు. అయ్యన్నను బెదిరిద్దామనుకుంటే కుదరదు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బుద్దా విజయ్(Buddha Vijay) మాట్లాడుతూ…
రాష్ట్రంలో ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి, మన దౌర్బాగ్యం. యువతకు ఉద్యోగాల కోసం చంద్రబాబు అనేక పరిశ్రమలను తీసుకొచ్చారు. జగన్ హాయాంలో పరిశ్రమలను రాష్ట్రం నుంచి పంపించేశారు. పరిశ్రమల గురించి తెలియని గుడ్డు మంత్రి అమర్ నాధ్. సంపద స్రుష్టించడం చంద్రబాబుకే సాధ్యం. 25 ఏళ్లకే అయ్యన్న శాసనసభలో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి. గజ దొంగల పార్టీని రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్రం ఏమైనా నీ అబ్బ జాగీరా? జగన్ రెడ్డీ విశాఖలోని ప్రభుత్వ భవనాలన్నీ 25వేల కోట్లకు తాకట్టు పెట్టిన మేధావి. కోడిపెట్ల గణేష్.. 11 సంవత్సరాలకే అంబేద్కర్ ను జననం, మరణం చూపించడం విచారకరం. అయ్యన్నను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కోడిపెట్ల గణేష్ కు లేదు. రాష్ట్ర భవిషత్తును నాశనం చేసిన దొంగ జగన్ రెడ్డి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే యువత నడుంబిగించాలి. సుధాకర్ డాక్టర్ ను చంపింది జగన్ రెడ్డే. చంపి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు అందలం ఇస్తావా? నెలరోజుల్లో జగన్ రెడ్డిని తరిమి, తరిమి కొడతారు. అద్దేపల్లి గణేష్. అనకాపల్లిలో స్థలం లేక నర్సీపట్నానికి మెడికల్ కాలేజీ వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. జగన్ రెడ్డి నాటు సారా అమ్మకం చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవాలి.
అయ్యన్న(Ayyanna Patrudu) మాట్లాడుతూ…
సైకో ముఖ్యమంత్రి యువకులను ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు హాయాంలో లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చేవిధంగా ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేసిన జగన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో సైకిల్ కి ఓటేసి, జగన్ రెడ్డిని పోయిన ఎన్నికలకు కోడి కత్తి. ఈ సారి రాయి డ్రామా. ఈ రెండు చంద్రబాబు చేయించాడనే అబ్బద్దాలు కల్పన నిన్ను జైలుకు పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో- పట్టాభిరామ్