ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా, మా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) తెలిపారు. కానీ ఇప్పుడు నేను దీనిపై ఎందుకు మాట్లాడుతున్నానంటే… ఈ వీడియో అంశాన్ని పవన్ కల్యాణ్ పొన్నూరులో ప్రస్తావించారు. మా అల్లుడు గౌతమ్, నా కుమార్తె విడాకులు తీసుకుంటున్నారు. ఆ ప్రక్రియ నడుస్తోంది. గతంలో కూడా గౌతమ్… నేను పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను కలుస్తాను, నేను చంద్రబాబు(Chandrababu)ను కలుస్తాను అని మా అమ్మాయితో అనేవాడు. విడాకులు ఇవ్వడానికి నా కూతురుకేమీ అభ్యంతరం లేదు… అయితే ఆమెకు పిల్లలున్నారు… వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ విషయంలోనే కోర్టులో మేం న్యాయపోరాటం చేస్తున్నాం. ఇది మా కుటుంబ విషయం. బయటివారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కూతురుకు సంబంధించిన విషయం కాబట్టి బహిర్గతం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. నా అల్లుడి మాటల వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడు. పవన్ కల్యాణే అతడితో మాట్లాడించాడు, చంద్రబాబు అందుకు సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. నేను సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నన్ను ఓడించాలనుకుంటున్న పవన్ కల్యాణ్, నన్ను అసెంబ్లీకి రానివ్వకూడదనుకుంటున్న చంద్రబాబునాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం ఇదని అంబటి ఫైర్ అయ్యారు.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.