Tuesday, September 15, 2026
News Navigation
Tuesday, September 15, 2026
News Navigation

Breaking

Tuesday, September 15, 2026
Home International మరోసారి అంతరిక్షయానం చేయనున్న సునీతా విలియమ్స్..

మరోసారి అంతరిక్షయానం చేయనున్న సునీతా విలియమ్స్..

by Satya
Sunita Williams

భారత సంతతి వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్(Sunita Williams) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 కు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్‌లైనర్‌ ద్వారా ఆమె ప్రయాణించనున్నారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుండడంపై సునీత విలియమ్స్ స్పందించారు.ఈసారి కాస్త ఆందోళనగా ఉందని, అయితే ప్రయాణంపై అంత భయం లేదని అన్నారు. లాంచ్ ప్యాడ్‌ వద్ద శిక్షణ సమయంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించడం సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. కాగా వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో కలిసి ఆమె ఈ ప్రయాణం చేయనున్నారు.ఈ అంతరిక్షయానంతో హ్యుమన్-రేటెడ్ అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించనున్న తొలి మహిళగా సునీత విలియమ్స్ నిలవనున్నారు. కాగా గతంలో ఆమె 2006, 2012లలో రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.


  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
  • బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.
    బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్‌కు ఒక విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు. ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: