జనసేన అధినేత గౌరవ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ గారు.
నేడు మాజీ ఎమ్మేల్యే వర్మ గారు అధ్యక్షతన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వర్మ గారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా జనసేన గెలుపుకు కష్టపడాలని పిలుపునిచ్చారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మన అందరమూ కలిసి పని చేయాలనీ, రాబోయే ఎన్నికల్లో గౌరవ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గించి చంద్రబాబు నాయుడు గారు గౌరవం కాపాడాలని తెలిపారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే మొదటి విడతలో MLC చేసి, క్షత్రియులు కోటాలో ప్రమోషన్ ఇచ్చి నన్ను గుర్తించడం జరుగుతుందని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గౌరవ చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజున ఉండవల్లిలో కలిసి పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించడం, ఏలేరు ఆధునీకరణ (సుద్దగడ్డ కొండకాలువ) కు నిధులు ఇచ్చి ముంపు నుండి ప్రజలను, పంట పొలాలను కాపాడాలని కోరడం జరిగింది. అదే విధంగా మత్స్యకారు తీరప్రాంతం కోతకు గురికాకుండా జియోట్యూబ్ ఏర్పాటు చేయాలనీ, నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తీ చేయాలనీ కోరడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి పరచాలని కోరారు.
గౌరవ చంద్రబాబు గారు ఆదేశాలు మేరకు జగన్ ను రాష్ట్రం నుండి పారద్రోలాలని, నువ్వు సహకరించాలని జనసేన అధినేత వారికీ, వారు కోరిన విధంగానే నువ్వు కూడా త్యాగం చేసావని, గత 18 ఏళ్ళుగా పార్టీకి సేవలు చేస్తూ, కుటుంబం అంతా ప్రజల్లో, వారి కష్టాలలో నిరంతరం శ్రమిస్తూన్నారని అభినందించారు. రైతులు కోసం అహర్నిశలు శ్రమించావు, నేటికి కూడా రైతులు కోసమే ఆలోచిస్తున్నావు. ప్రజలను, కార్యకర్తలను కాపాడే భాద్యత నాదని వర్మ గారు హామీ ఇచ్చారు.
ఇది చదవండి : రైల్వే కోడూరు సీటు ఎస్సీ మాదిగలకే – నగిరి పాటి సంతోష్
నేడు గొల్లప్రోలు టౌన్ జనసేన నాయకులు శ్రీ.కడారి తమ్మయ్యనాయుడు గారు పిఠాపురం టౌన్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మేల్యే వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, మీరు తీసుకున్న నిర్ణయం పిఠాపురం ప్రజలు భవిష్యత్తు మారుతుందని చెప్పి అభినందనలు తెలిపారు, అదే విధంగా పిఠాపురం జనసేన సైనికులు వర్మ గారిని కలిసారు, గొల్లప్రోలు మండలం చెందుర్తి, తాటిపర్తి, మరియు చిన్న జగ్గంపేట గ్రామాలు పిఠాపురం మండలం చిత్రాడ, కొత్తపల్లి మండలం ఉప్పాడ పంచాయతి సుబ్బంపేట గ్రామాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులుతో సమావేశమై జనసేన అధినేత శ్రీ.పవన్ కళ్యాణ గారిని బారీ మెజారిటీతో నెగ్గించాలని సూచించారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు తూచ తప్పకుండా మన సొంత ఎలక్షన్ లా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి నెగ్గించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అనుభంద కమిటి సభ్యులు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్సిలు, మండల, టౌన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జులు, అసెంబ్లీ యువత, TNSF, TNTUC ప్రెసిడెంట్స్, కౌన్సిలర్ లు, సర్పెంచ్ మరియు MPTC సభ్యులు, మాజీ ZPTC, MPTC, సర్పెంచ్ మరియు కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి