కాంగ్రెస్ 50 ఏళ్లుకు పైగా పరిపాలించి మహబూబ్ నగర్ ను వలసల జిల్లాగా మార్చిందన్నారు కేసీఆర్. మహబూబ్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఈ విధంగా మాట్లాడారు. 2004లో గెలిచిన కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణకు 33పార్టీలు మద్ధతిచ్చాయని.. ఇక కాంగ్రెస్ కు గతి లేక తెలంగాణ ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిందని పేర్కొన్నారు. అంతే కాకుండా 3గంటలు కరెంట్ ఇస్తామని పీసీసీ చీఫ్ అంటున్నాడు. దీన్ని పరిగణలోకి తీసుకొని అయినా రాయేదో.. రత్నమేదో ప్రజలే గుర్తించాలన్నారు. అభ్యర్థి వెనకాల ఉన్న పార్టీ మంచిచెడులు తెలుసుకొని ఓటు వేయాలని సూచించారు. అధికారంలోకి రాగానే పెన్షన్ ను 5వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే కంటివెలుగు పథకం కింద 3కోట్ల మందికి పరీక్షలు చేయించామని తెలిపారు. ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్ధేశంతోనే పెన్షన్లు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Also…
Read Also…