70
ప్రజల ఆస్తికి భద్రత లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూహక్కు చట్టం 2023 ను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం న్యాయవాదుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. అసెంబ్లీలో కానీ బార్ అసోసియేషన్ లో కానీ చర్చించకుండా తీసుకువచ్చిన ఒక చీకటి చట్టమని అన్నారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.