77
నంద్యాల టీడీపీ ఆధ్వర్యంలో భోగి సంబరాలు టీడీపీ శ్రేణులు జరుపుకున్నారు. భోగి మంటల్లో వైసీపీ వైఫల్యాల పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కీడు తొలగాలి, ఎపి వెలగాలి నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించామని వైసిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారం లోపు సిబిఎస్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 256 వారాలైనా సిపిఎస్ రద్దు చేయలేదని ఎద్దేవా చేశారు. మద్యపానం నిషేధిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు చేయలేదన్నారు. మూడు రాజధానులు అని కాలయాపన చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న ప్రభుత్వం క్యాలెండర్ మారుతుంది తప్ప జాబ్ క్యాలెండర్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.