ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం( Telangana Government)కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎండ తీవ్రతకు మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా మాడిపోతున్నాయి..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.