అయోధ్య దీపోత్సవ్ ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ

Ayodhya

Advertisements

&NewLine;<p>దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు&period; సరయూ నది తీరంలో నిర్వహిచిన ఈ వేడుకలో భాగంగా ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు&period; గతేడాది కంటే 6&period;47 లక్షల దీపాలను అధికంగా వెలిగించారు&period; ఇది &OpenCurlyQuote;గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను సొంతం చేసుకుంది&period; ఈ ఫొటోలను పంచుకున్న మోదీ దీపోత్సవాన్ని అత్యద్భుతమైన&comma; మరపురాని వేడుకగా అభివర్ణించారు&period; గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికార్డును ఈసారి అంతకుమించిన దీపాలతో అయోధ్య తన రికార్డును తానే బద్దలుకొట్టింది&period; ఈ కార్యక్రమంలో 25 వేల మందికిపైగా వలంటీర్లు భాగస్వాములయ్యారు&period; ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు&period; తొలి ఏడాది 51 వేల దీపాలు వెలిగించారు&period; ఆ తర్వాతి నుంచి ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తున్నారు&period; ఈ ఏడాది దీపోత్సవ్‌లో 50 దేశాల రాయబారులు&comma; ఉన్నతాధికారులు హాజరయ్యారు&period; ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.