పోలీసు వృత్తి ఒక కత్తి మీద సాము లాంటిదని, పోలీస్ యంత్రాంగం విధి నిర్వహణలో సక్రంగా సమన్వయం పాటించి విధులను సక్రమంగా నిర్వహించాలని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 1.40 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆద్నానయీమ్ఆస్మి, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక తో కలిసి ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి అశోక్ కుమార్ ప్రారంభించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రాంగం విధులను సక్రంగా నిర్వహించాలని ఆయన సూచించారు. నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు. మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శించుకోవటానికి విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు విధులను కూడా సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. అనంతరం పోలీసు అదికారులు తో కలిసి హంసలదీవి గ్రామంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలుతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారితీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇది చదవండి: యాత్ర ఏర్పాట్లపై బీజేపీ నాయకులతో బండి సంజయ్ భేటీ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.