మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామంలో గోలేటి శంకర్ కుటుంబ సభ్యులను పిస్తోల్ బెదిరించి పారిపోయిన నిందితులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి రూరల్ సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎసిపి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం సాలిగామ గ్రామానికి చెందిన గొలెటి శంకర్ కుమార్తె బేబీకి మాల గురజాల గ్రామానికి చెందిన గోమాస నరేందర్ తో 2016లో వివాహం జరిపించగా, పెళ్లి అయినప్పటి నుండి నరేందర్ తన భార్య అత్తమామలను అదనపు కట్నం అస్తికోసం వేధించేవాడని తెలిపారు.గతంలో ఇదే విషయంలో నరేందర్ ను శాలిగమ గ్రామస్తులు కొట్టగా అట్టి విషయాన్ని మనసులో పెట్టుకున్న నరేందర్ వారిని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో తనతో పని చేస్తున్న బీహార్ కు చెందిన రవీందర్ పెళ్లికి వెళ్లి అక్కడ పిస్టల్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈనెల 27వ తేదీన రాత్రికి 10 గంటల సమయంలో నరేందర్ పిస్టల్ తో తన మామ ఇంటికి వెళ్లి వారిని ఆస్తి కోసం బెదిరించి ఇంటి ముందు పిస్టల్ తో రెండు రౌండ్ లు కాల్పులు జరిపి తన స్నేహితుడు మహేష్ తో పారిపోయినట్లు పేర్కొన్నారు. నిందితుడు నరేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు కోడి మహేష్ పరారీలో ఉన్నట్లు త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితుడు నరేందర్ నుండి 9MM పిస్తోల్ ,6 బుల్లెట్లు, ఒక బైకు, ఒక సెల్ ఫోన్, స్వాధీనం చేసుకున్నారు.
101
previous post