రాయదుర్గంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ (Police March Fast).
ఎన్నికల నిబంధనలో ఎవరు ఉల్లంఘించిన కఠిన చర్యలు.
రాయదుర్గం పట్టణంలో గురువారం కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ (Police March Fast) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయదుర్గం శాంతినగర్ బాలగంగాధర్ తిలక్ పాఠశాల నుండి వినాయక సర్కిల్ మీదుగా తెరు బజారు నుండి మెయిన్ రోడ్డు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు పోలీస్ మార్చ్ పాస్ట్ కవాత్ నిర్వహించారు. అనంతరం డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విధుల్లో భాగంగా గ్రామాల్లో పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నియోజకవర్గాల వ్యాప్తంగా పోలీస్ కవాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించడం కోసం పోలీసులు తమ వంతు బాధ్యతగా శాంతితో వాతావరణం కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును వినియోగించుకునే స్వయం ప్రతిపత్తి తో తమ ఓటు హక్కును తానే స్వతంత్రంగా వినియోగించుకునే విధంగా కావలసిన భద్రత మరియు శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించేoదుకే పోలీస్ వ్యవస్థ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ 144 సెక్షన్ తోపాటు అల్లర్లు అరాచకాలు నిర్వహించే వారిపై గట్టి నిఘ ఏర్పాటు చేసి అలాంటివారిపై పోలీస్ లు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి