120
జనసేన సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కారణాలు తెలియకుండానే పోలీసులు తనిఖీలు చేస్తుండటంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యకర్తలు ఉంటున్న అపార్ట్ మెంట్లపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఏ అపార్ట్ మెంట్ లో ఎవరూ ఉంటున్నారో పోలీసులు వాకబు చేస్తున్నారు. వైసిపి సర్కార్ పోలీసులను అడ్డు పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేస్తోందని జనసేన నేతలు మండిపడుతున్నారు. జనసేన కార్యాలయంలో పని చేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా అపార్ట్ మెంట్ ను అద్దెకు తీసుకున్నారు. అందులో పవన్ సెక్యూరీటీ, కార్యాలయ సిబ్బంది నివాసం ఉండే ప్లాట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.