79
రాజంపేట నియోజకవర్గంలోని గాలివీడు టౌన్లో నిజం గెలవాలనే కార్యక్రమంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్త కుటుంబాని ఓదార్చి ఆర్థికంగా ఆదుకునేందుకు వెళ్తున్న సమయంలో నారా భువనేశ్వరి కాన్వాయ్ ని పీలేరు పట్టణానికి వచ్చిన సమయంలో పీలేరు టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి నారా భువనేశ్వరి గాలివీడుకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అన్ని వాహనాలను ఒక్కసారిగా అనుమతించలేమని పోలీసులు తెలిపారు. తర్వాత కాసేపు కాన్వాయ్ తో పాటు నాలుగు వాహనాలు అనుమతించారు.