అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్టీ నేత యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో తోట కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి, వీరపల్లి, ఒంటిమిట్ట, సిద్దవట్టం, రాజంపేట, నందలూరు మండలాల నుంచి పెద్దఎత్తున జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. వారు యల్లటూరి శ్రీనివాసరాజు తెలుగుదేశం వెంట నడవాలని, భారీ మెజారిటీతో గెలిపించు కోవాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన, టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. జనసేన టిక్కెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా, సంస్కారవంతంగా సహకరించిన విద్యావంతుడు యల్లటూరి శ్రీనివాసరాజును సుగవాసి కొనియాడారు.
annamayya district news
రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో గెలవబోతున్నాం – గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy)
వైఎస్సార్ సిపికి ప్రజలలో బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉందని, రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో గెలవబోతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మ్నాదళం శిబ్యాల గ్రామంలో వైఎస్సార్ సిపి ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రెండవ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడప గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిన ప్రజలకు వివరిస్తూ ఈ ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేదోడు వాదోడు గా ఉండేందుకు అనేక వ్యవస్థలను సిఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారని అందుకే ఆయనను గుండెల్లో పెట్టుకొని ప్రజలు పుజిస్తున్నారన్నారు. ఒకటో తేదీ వేస్తే తెల్లవారక ముందే ఇచ్చేటువంటి పెన్షన్ లు చూసి అవ్వ తాతల మోములో ఆనందం కనపడేదన్నారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదు..
చంద్రబాబు నాయుడు కొవ్వర్టు నిమ్మగడ్డ ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలాలు చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఒక ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేయడంతో సేవ చేసే వాలింటర్లు, లబ్దిదారులు నిరుత్సాహంలో ఉన్నారన్నారు. పేదలకు మంచి జరిగేటప్పుడు సంతోష పడాలి కాని ఈర్ష ఉండకూడదన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయకపోగా మంచి కార్యక్రమాలు చేసే వారిపై కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. రాజకీయాలలో లబ్ధి పొందాలను మరొక విధంగా తెలియదు కానీ అనేక విధాలుగా విమర్శించి మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పేద ప్రజల విషయాలలో ఎప్పుడూ కూడా రాజకీయాలు చేయకూడదు. అలా చేయడమే చంద్రబాబు నైజం అన్నారు. కోత్తగా మాట్లాడుతున్నారు
మాది బీసీల పార్టీ అని జయహో బీసీలను అంటూ మాట్లాడటం విడ్డూరం…
ఊరురికి ఒక సభను పెడతాం మాది బీసీల పార్టీ అని జయహో బీసీలను అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డికె దక్కుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఎంతో చులకనగా మాట్లాడి తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని ఉద్ధరిస్తా అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మైనార్టీలను హింసించడమే కాకుండా మోడీ గారితో మనం స్నేహం చేస్తే మోడీ గారు ఈ దేశం నుంచి మైనార్టీలను తరిమేస్తారని లౌకిక వాదం లేదని చెప్పిన వ్యక్తి ఐదు సంవత్సరాలు తిరకముందే ఆయన పోత్తులకు వెళ్లారు..
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…
ఆయనకు ఎలాగు సిగ్గులేదు ఆయన ప్రోత్సహించి ఓటు అడిగేవారికి సిగ్గులేదుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే ఓట్లు పడవని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గడపగడపకు వెళ్లి మమేకమై వారి సమస్యలను పరిష్కరించగలిగామన్నారు. ఆర్చులు కట్టి బతుకుతున్నాం అంటున్నారు. ఒకసారి లోపలికి వెళ్లి చూస్తే ఎట్లా ఉంటాయనేది తెలుస్తుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో నీరు చెట్టు పనులు చేసిన దోపిడీదారులు కూడా జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించారన్నారు. అలాగే రాప్తాడులో నిర్వహించినటువంటి సిద్ధం సభ ఎరకంగా అయితే వెళ్ళామో అంతకంటే పెద్ద ఎత్తున రేపు మేమంతా సిద్ధం అనే సభకు మదనపల్లిలో జరగబోయే సిద్దం సభకు కూడా ప్రతి ఊరు, ప్రతి పల్లె నుంచి కూడా అందరు కూడా స్వచ్ఛందంగా ప్రహాలు తరలి వచ్చి విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సందేశం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
ఇది చదవండి : ఏలూరు లో కిలాడీ డాక్టర్..!
Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తంబళ్లపల్లి భాజపా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారి పర్యటన కార్యక్రమంలో భాగంగా మన తంబాలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోతుల సాయినాథ్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పోతుల సాయినాథ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఐన జయచంద్రరెడ్డి విజయం సాధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ ఐదు ఏళ్ళ లో తంబల్లపల్లి ప్రజలు చాలా కష్ట పడ్డారు త్వరలో ప్రజల కు ఈ రక్షస పాలన నుండి విముక్తి లభిస్తుందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అయిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంట అందజేస్తూ వాటిని గురించి వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోమండల ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన సీనియర్ నాయకులు పవన్ రెడ్డి, అరవింద్, రాజేష్, బాబు, లోకేష్ టిడిపి మరియు జనసేన నాయకులు పాల్గొని విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేశారు..
రాజంపేట నియోజకవర్గంలోని గాలివీడు టౌన్లో నిజం గెలవాలనే కార్యక్రమంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్త కుటుంబాని ఓదార్చి ఆర్థికంగా ఆదుకునేందుకు వెళ్తున్న సమయంలో నారా భువనేశ్వరి కాన్వాయ్ ని పీలేరు పట్టణానికి వచ్చిన సమయంలో పీలేరు టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి నారా భువనేశ్వరి గాలివీడుకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అన్ని వాహనాలను ఒక్కసారిగా అనుమతించలేమని పోలీసులు తెలిపారు. తర్వాత కాసేపు కాన్వాయ్ తో పాటు నాలుగు వాహనాలు అనుమతించారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని వై కోట గ్రామంలో ఈ రోజు నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కారూపానంద రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ సంబంధించి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ నుంచి 5 లక్షల రూపాయలు సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా వై కోట గ్రామానికి వచ్చి ప్రజలు ఎంతో గొప్పగా ఆయనను స్వాగతించి పూల వర్షం కురిపించారు జనసముద్రం అంతా ఆ గ్రామంలో అక్కడే కనబడింది గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్ మాకు తన సొంత నిధులు ఇచ్చి ఈ ప్లాంట్ నిర్వహించినందుకు ముక్కా రూపానంద రెడ్డి కి మా గ్రామం తరపున గ్రామ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము అడిగిన వెంటనే కాదనకుండా ప్లాంట్ సంబంధించి అమౌంట్ వేసి ప్రారంభించే దానికి ఆయనే రావటం మాకు ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు. ఎన్నో వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముక్కా రూపానంద్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని ఆ గ్రామం ఎంత మార్మోగింది. ముక్కా రూపానంద్ రెడ్డి మాట్లాడుతూ వైకోట గ్రామానికి సంబంధించి ఎటువంటి కష్టమొచ్చినా ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రావచ్చు అని ఏదైనా నేను చేసే దానికి సిద్ధమని ఆయన అన్నారు. గ్రామస్తులంతా చప్పట్లు కొడుతూ ఈలలు వేయడం జరిగింది. ఈ గ్రామం నాది ఇక ఈ గ్రామానికి ఏమి కావాలన్నా అందరి కంటే నేను ముందుంటాను ఏమి కావాలన్నా నేను చేస్తానని ఆయన అన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు రోడ్డు నందు రు . 3 కోట్ల 85 లక్షల నిధులతో నిర్మించిన టిటిడి కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ముందుగా కంట్రాక్టర్ కేతంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడ టిటిడి అధికారులు తో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణమండపం ను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడతూ 15 రోజుల్లో ఈ కళ్యాణమండపం అందరికి అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక్కసారే జరుగుతుందని ఎంతో మంది ఎన్ని ఆశలతో వివాహం చేసుకోవాలని కోరుకొంటారన్నారు. అటువంటి వారి కోసం టిటిడి వారు తక్కువ ఖర్చులతో వివాహం చేసుకునేలా సౌలభ్యాన్ని కల్పించిన టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి , ఈ ఓ ధర్మా రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, అన్నమయ్య జిల్లా వైసిపి విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, ప్రముఖ వైద్యులు బయా రెడ్డి, మాజీ డి సి సి చైర్మన్ ఆవుల విష్ణు వర్ధన రెడ్డి, చిదంబర్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.





Total views : 56861