ప్రజా ఆశీర్వాద యాత్ర (Praja Ashirwada Yatra) :
ఏడేండ్లు ఏం చేశామో గడపగడపకు తెలిపేందుకే ప్రజా ఆశీర్వాద యాత్ర (Praja Ashirwada Yatra) ద్వారా బీజేపీ కార్యకర్తలు ముందుకు కదిలారు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్లే నియోజకవర్గం అజీజ్ నగర్ బిజెపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
28న, శంషాబాద్ లోని నర్కుడ గ్రామంలో గల శ్రీ సీతా రామచంద్ర స్వామి క్షేత్రం అమ్మపల్లి గుడి వద్ద ప్రారంభం…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుందన్నారు. గురువారం 28వ తేదీ ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. శంషాబాద్ అమ్మపల్లి దేవాలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని,ప్రతిరోజు 10 నుంచి 20 గ్రామాలను తిరుగుతూ ప్రజలు చైతన్యవంతులు చేయడం జరుగుతుందన్నారు. నాలుగు నియోజవర్గంలో యాత్ర కొనసాగుతుందని కొండ విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
చేవెళ్ల లోక్సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలోనూ యాత్ర..
ఈ ఏడు ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గడప గడపకు తెలిసేవిధంగా చేయడం కోసమే ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించడం జరుగుతోందని కొండ విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. రాబోయోది బీజేపీ ప్రభుత్వం అని దీనికి ప్రతి ఒక్కరూ సైనిక శక్తిగా మారి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని పలు సూచనాలు చేశారు. లక్షల కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఒరిగింది లేదన్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ వెళ్ళి వివరించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.
బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేద్దామని పిలుపునిచ్చారు. పది సంవత్సరాలలో బీఆర్ఎస్ తెలంగాణను అప్పులపాలు చేయగా, అధికారం కోసం కాంగ్రెస్ వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఈత బోధ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సమావేశంలో రాజేంద్రనగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, మైలార్ దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జ్ఞానేశ్వర్, యువ నాయకుడు వైభవ్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ పరమేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ వెంకట్ రెడ్డి, బీజేవైఎం నాయకుడు శ్రీకాంత్, రవి యాదవ్, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి