రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి….

Rashtrapati Nilayam

Advertisements

&NewLine;<p>శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు&period; ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్&ZeroWidthSpace; ఆంక్షలు విధించారు&period; వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు&period; సాయంత్రం 6&period;25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు&period; అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించి సేద తీరి&comma; కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు&period;<br>శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి&comma; పూర్తి చేశారు&period; ఈ క్రమంలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనను రద్దు చేశారు&period; రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కూడా భారీగా పెంచారు&period; ఈ పర్యటనలో భాగంగా భూదాన్ పోచంపల్లి వెళ్లనున్నారు&period; చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు&period; అదేవిధంగా పద్మశ్రీ&comma; సంత్ కబీర్&comma; ఇతర జాతీయ పురస్కార గ్రహీతలతో మాట్లాడి&period;&period;పోచంపల్లి చేనత పరిస్థితులపై చర్చించనున్నారు&period; ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు&period; వారిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు&period; శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లను సైతం సందర్శించి మగ్గాలు&comma; మగ్గం నేసే ప్రక్రియ పరిశీలించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్