93
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ ఎఫ్ సి ఎల్) లో యూరియా ఉత్పత్తి ఆదివారం నుంచి నిలిచిపోయింది. కర్మాగారంలో స్టీమ్ పైప్ లైన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు వెంటనే కర్మగారాన్ని షట్ డౌన్ చేశారు. కాగా దీనికి సంబంధించి 15 రోజుల వ్యవధిలో మరమ్మతులు చేసే అవకాశం ఉందని, అనంతరం యధావిధిగా యూరియా ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా చేశారు. ప్రస్తుతం తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో యూరియా కు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి నిలిచిపోవడం కొంత రైతులకు ఆందోళన కలిగిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.