81
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాల్టీలో కార్మికులు ఉద్యమించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. పట్టణంలో మొత్తం 82 మంది కార్మికలు ఉన్నారు. వారిలో కేవలం ఇద్దరికి మాత్రమే వేతనాలు పెంచారు. మిగతా 80 మంది పట్ల అధికారలు వివక్ష చూపుతున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. తమకు కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా ఉన్నతాధికారులు స్పందించం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం చేయకుంటే రెండు మూడు రోజుల్లో సమ్మెకు కూడా దిగుతామని హెచ్చరించారు.