ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చలమల్ల కృష్ణారెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి… గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ… స్థానికుడినైన తనను గెలిపించాలని కోరారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, కాంగ్రెస్ అహంకార అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండి మునుగోడు నియోజకవర్గాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ప్రభాకర్ రెడ్డి తన సొంతంగా నిధులు తెచ్చిన దాఖలాలు లేవని కృష్ణారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్లి నిద్రపోవడానికి తప్ప నియోజకవర్గ సమస్యలపై పోరాడింది ఏమీ లేదన్నారు. ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మునుగోడును సమగ్రంగా అభివృద్ధి చేస్తానని చలమల్ల కృష్ణా రెడ్డి కోరారు.
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి….
78
previous post