తన హయాంలోనే భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జనసేన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పష్టం చేశారు. భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసానని, ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందడంతో ఆశించిన స్థాయిలో భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని అన్నారు. అయితే 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో భీమవరం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు.
ముఖ్యంగా రాయలం మురుగు డ్రైన్ ను క్లోజ్డ్ డ్రైన్ గా తీర్చి దిద్దడం జరిగిందన్నారు. భీమవరం నియోజకవర్గంలో పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎవరి పైనా కూడా కక్ష్య పూరితంగా పనిచేయలేదు అన్నారు. అతి సామాన్యుడు వచ్చినా పనిచేసి పంపించడం జరిగింది అన్నారు. నాగిడి పాలెం బ్రిడ్జిని పూర్తి చేసి మూడు జిల్లాలకు ఈ వంతెనను అనుసంధానం చేయడం జరిగింది అన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనను నిలబెట్టారని, కచ్చితంగా గెలుస్తానని రామాంజనేయులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, చెనమల్ల చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.