తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 2024సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి (Purandeshwari) ఈరోజు విజ్జేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు..ఆమెతోపాటు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విజ్జేశ్వరం నుండి మొదలైన ఈ రోడ్ షోకి విశేష స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజ్జేశ్వరం, గోపవరం, పురుషోత్తపల్లి, సమిశ్రగూడెం డి. ముప్పవరం, కలవచర్ల, మునిపల్లి, పెండ్యాల గ్రామాలలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు అడుగడుగునా మంగళ హారతులు పట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని అదే విధంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేషను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, భారతీయ జనతా పార్టీ, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి