కొమురవెళ్లికి హల్ట్ స్టేషన్ ఇంకా అందని ద్రాక్ష..

Advertisements

<p>సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెళ్లి మల్లన్న స్వామి ఆలయం ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆధ్యాత్మిక క్షేత్రం&period; తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్&comma; మహారాష్ట్ర&comma; కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు&period; భక్తుల రవాణా సౌకర్యాల కోసం కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైన్‌లో భాగంగా సుమారు 3 కోట్ల రూపాయలతో కొమురవెల్లి సమీపంలో హల్ట్ స్టేషన్ నిర్మించారు&period; షెల్టర్&comma; హై లెవల్ ప్లాట్‌ఫామ్&comma; వెయిటింగ్ రూమ్&comma; తాగునీరు&comma; మరుగుదొడ్లు&comma; టికెట్ కౌంటర్ వంటి అన్ని వసతులు సిద్ధమైనప్పటికీ స్టేషన్ ప్రారంభం మాత్రం ఇంకా జరగలేదు&period; ప్రస్తుతం భక్తులు బస్సులు&comma; ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది&period; రైల్వే హాల్ట్ ప్రారంభమైతే భక్తులకు ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది&period; కానీ నిర్మాణం పూర్తై నెలలు గడిచినా ప్రారంభం లేకపోవడం భక్తుల్లో నిరాశను కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>గత సంవత్సరం ఫిబ్రవరి 15à°¨ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి&comma; మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ చేతుల మీదుగా కొమురవెల్లి రైల్వే హల్ట్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగింది&period; అనంతరం వేగంగా పనులు పూర్తయ్యాయి&period; దసరా పండుగ రోజున స్టేషన్ ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు&period; మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా పరిశీలించి త్వరలో ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు&period; ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి పైగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వస్తుండగా&comma; రైల్వే స్టేషన్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; ఈ హల్ట్ స్టేషన్ ప్రారంభమైతే భక్తులకు మాత్రమే కాకుండా స్థానిక వ్యాపారులకు&comma; యువతకు ఉపాధి అవకాశాలకు కూడా ఊతం లభిస్తుంది&period; దీంతో కేంద్ర ప్రభుత్వం&comma; రైల్వే అధికారులు వెంటనే స్పందించి స్టేషన్‌ను ప్రారంభించాలని భక్తులు&comma; స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..