112
నేడు రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ తరఫున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్లు వేయనున్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్ది రాజు రవిచంద్ర నామినేషన్లు వేయనున్నారు. కాగా వద్దిరాజు రవిచంద్రకు రెండో సారి రాజ్యసభ అవకాశాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చారు. మొదటి దఫాలో రెండేళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా రవిచంద్ర పనిచేశారు. కాగా, రేపు రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 20న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 56 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.