Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home National ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది..

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది..

by Rama
Farmers in Delhi

రైతులు ఆందోళన (Farmers Darna):

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన (Farmers Darna) కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు అంటున్నారు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది. రైతుల డిమాండ్లు ప్రధానంగా కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పెన్షన్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంపు, 2020-21లో ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసుల్ని కొట్టివేయడం, లఖింపూరిఖేరి బాధ్యులను శిక్షించడం, రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, పరిహారం, నకిలీ విత్తనాలు, మందుల తయారీదారులపై కఠిన చర్యలు మిర్చి, పసుపు, సుగంధ పంటలకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, అటవీ భూముల రక్షణ రైతుల డిమాండ్‌లుగా ఉన్నాయి.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇవే అంశాలే అజెండాగా కేంద్రంతో రైతులు చర్చలు జరపనున్నారు. మరోవైపు సరిగ్గా ఎన్నికలకు ముందు రైతులు ఆందోళనకు దిగడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వమే నెరవేర్చాలన్నది అన్నదాతల వాదన. సంయుక్త కిసాన్ మోర్చా -రాజకీయేతర విభాగం ఆధ్వర్యంలో తాజా ఆందోళనలు జరుగుతున్నాయి. Read Also..

  • స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
  • తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.
    తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయంలో అధికార టీవీకే, డీఎంకే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించే ముందు వారి ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తుల వివరాలను…
  • పోలీస్ స్టేషన్‌ ముందు రాహుల్ గాంధీ ధర్నా.
    పెల్లెట్ గన్ గాయాల వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఆందోళనకు దిగారు. జులై 20న జరిగిన జెన్‌-జీ విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ గాయాలయ్యాయని ఆరోపిస్తున్న సాహిల్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: