Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

by CVR NEWS
గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ అధికారులమంటూ హైవేపై వాహనాలను ఆపి, తనిఖీల పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న ఆన్‌లైన్ దోపిడీ బట్టబయలైంది. రసీదులు లేని అక్రమ వసూళ్లతో వాహన డ్రైవర్లను వీరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న గూడ్స్ వాహనాలను అడ్డుకుంటున్న కొందరు వ్యక్తులు, తాము కమర్షియల్ టాక్స్ అధికారులమని చెబుతూ తనిఖీలు చేస్తున్నారు. అనంతరం వాహనాలలో తప్పులున్నాయంటూ జరిమానా పేరుతో భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ జరిమానా డబ్బులను ప్రభుత్వ ఖాతాలకు కాకుండా, తమ వ్యక్తిగత ఫోన్‌పే, గూగుల్ పే ఖాతాలకు పంపించాలని డ్రైవర్లపై ఒత్తిడి తెస్తున్నారు. డబ్బులు తీసుకుంటున్నా ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని, రసీదు అడిగితే సమాధానం చెప్పకుండా గంటల తరబడి ఎండలోనే నిలబెడుతున్నారని డ్రైవర్లు వాపోయారు. ఈ దోపిడీపై సమాచారం అందుకున్న ‘సివిఆర్ న్యూస్’ ప్రతినిధి వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు. మీడియా ప్రతినిధిని చూడగానే అక్కడ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. “భోజనం చేసి వస్తాం” అంటూ అక్కడికక్కడే డ్రైవర్లను వదిలేసి తోకముడిచి పరారయ్యారు. నిజమైన అధికారులైతే రశీదులు ఇవ్వాలని, ఇలా వ్యక్తిగత ఖాతాలకు డిజిటల్ వసూళ్లకు పాల్పడటంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039221
Total views : 194831

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: