శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం MLA సీటు జనసేన పార్టీకే కేటాయించాలని జన సైనికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు జనసేన వీర మహిళలు కలిసి ధర్మవరం ఎమ్మెల్యే సీటు చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీకే ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ధర్మవరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గత ఐదు సంవత్సరాలుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం టు ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ నాయకులు ధర్మవరం ప్రజల సమస్యలు తెలిసిన చేనేత సమస్యలు తెలిసిన స్థానికుడైన చిలకం మధుసూదన్ రెడ్డి కి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించాలి. మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న వాటికి అనుకూలంగా పార్టీలకు సేవ చేస్తామని ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు.
ధర్మవరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ…
77
previous post