అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు… 34 మందితో సెకండ్ లిస్ట్ విడుదల చేశారు. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు…రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. గురజాల స్థానంలో యరపతినేని శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ కన్ఫామ్ చేసింది. ఆత్మకూరు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ దక్కింది. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల…
107
previous post