అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు… 34 మందితో సెకండ్ లిస్ట్ విడుదల చేశారు. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు…రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. గురజాల స్థానంలో యరపతినేని శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ కన్ఫామ్ చేసింది. ఆత్మకూరు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ దక్కింది. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
telugudesam party
ముస్లిమ్ మైనార్టీలు విశేషంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం లోని కనేకల్ మండల కేంద్రంలో తేదేపా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మైనారిటీలు నారా చంద్రబాబు నాయుడు అధికారం లోని రావాలని తేదేపా హయంలో లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, రక్షణ గా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీలు కనేకల్‌లో ఏ ఇంటికి వెళ్లిన ప్రజాసారణ లభిస్తాందన్నారు. జగన్ ప్రభుత్వంలో నిత్యవసర సరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పెట్రోల్, డీజిల్ ధరలు 9 సార్లు పెరగడంతోపాటు చివరకు విద్యుత్ చార్జీలు, మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజల నడ్డి విరిచిన ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని మండిపడ్డారు. తెదేపా హాయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు సమక్షంలో కనేకల్లు రైతులకు సంవత్సరానికి రెండు పంటలు పండే విధంగా చెరువులకు నీరు అందించామన్నారు. అదేవిధంగా హెచ్ ఎల్ సి నీటి వాటా రైతులకు సరిపడే విధంగా అందించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50000 మెజారిటీ కి తగ్గకుండా విజయం సాధిస్తామని దిమా వ్యక్తం చేశారు.
ఈ నెల 4 న కియా కార్ల పరిశ్రమ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా బహిరంగ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారథి పిలుపునిచ్చారు. గత ఐదు రోజుల నుండి అమరావతిలో ఉన్న బీకే పార్థసారథి తన కార్యాలయానికి ఇవాళ ఉదయం వచ్చాడు. ఆయన అమరావతి వెళ్ళినప్పుడు నుండి ఆయన కార్యాలయం వద్ద అభిమానులు కార్యకర్తల సందడి నెలకొంది నేడు తన కార్యాలయం రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోవాలని అధిష్టానం సూచించిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలోనే మంచి పేరున్న నాయకుడిగా కొనసాగుతున్నానని అలాగే ఈ నెల జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.




Total views : 90873