68
తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 20న అసెంబ్లీ సమావేశంఉండటంతో మంగళవారం రాత్రికే సీఎం రేవంత్ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.