దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం, మంత్రులు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయంమన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
revanth reddy live
తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 20న అసెంబ్లీ సమావేశంఉండటంతో మంగళవారం రాత్రికే సీఎం రేవంత్ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని బీఆర్ఎస్ కు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేటీఆర్ విమర్శలపై సీఎం నిశితంగా స్పందించారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే అర్థరహితమన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి తెలియదంటూ తిప్పికొట్టారు.
రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించారు. ఈ మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ధరణి- భూ సమస్యలపై సీఎం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ పాల్గొన్నారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ చట్టాల నిపుణులను సభ్యులుగా నియమించాలని సూచించారు. పోర్టల్‌కు సంబంధించిన వివరాలపై నవీన్ మిత్తల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సమీక్ష సందర్భంగా సీఎంతోపాటు మంత్రులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో సమాచారం అందించాలని ఆదేశించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 11 రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి,వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవీ గుప్తా, ఇంటలీజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్బంగా సి.ఎం. మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు . ఈ విభాగానికి కావాల్సిన నిధులు,వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సయిజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పై కార్యాచరణ ప్రారంబించాలి. ప్రతీ మంగళవారం ,శుక్రవారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్న 01 వరకు ప్రజా వాణి నిర్వహించాలి. ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాదర్బార్ ను ఇక నుంచి ప్రజావాణి గా పిలవాలని ఆదేశం. ప్రజావాణి లో వికలాంగులు ,మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలి.
కాంగ్రెస్శాసన సభాపక్ష నేత రేవంత్‌రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతోపాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు చేస్తున్నారు. దీని కోసం మూడు వేల మందికి పైగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే స్టేడియం లోపల, బయట మెటల్‌డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో తనిఖీలు పూర్తి చేశారు. నేడు మరోసారి తనిఖీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ఆంక్షలు విధించారు. ఇక, బుధవారం ఇన్ఛార్జ్డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్పోలీస్కమిషనర్సందీప్శాండిల్య, సెంట్రల్జోన్డీసీపీ శ్రీనివాస్తదితరులు స్టేడియాంకు వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు… విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేరే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందన్నారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పంపుతున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి, కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, బలరామ్ నాయక్, సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు. డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్ శాండిల్యా. రేవంత్ రెడ్డిని విమానాశ్రయంలో కలిశారు. అనంతరం నేరుగా ఎల్లా హోటల్ కు వెళ్లనున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నా అభినందనలు, తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక. తెలంగాణలో పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు….
తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్‌గా సారథ్యం వహించి, నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపికవడం హర్షణీయం. అందుకు సోదరుడు రేంవత్ రెడ్డికి నా శుభాకాంక్షలు. పదేండ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారు. అవ్వన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యార్థి పార్టీలు విమర్శలు చేశాయి. కానీ, కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకూ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం. అందుకు ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలం. ఇదే సిద్దాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని, అదిష్టానానికి తీర్మాణం పంపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి, పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రధాన్యానికి ఇది సంకేతం. ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజా పాలనకు దోహద పడుతుంది. సోదరుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజాఅనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది. సోదరుడు రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు.