Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి లేఖ

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి లేఖ

by Prakash
revanth reddy cm

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు… విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేరే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందన్నారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పంపుతున్నామని పేర్కొన్నారు.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్‌ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి, కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.

Advertisements

You may also like

Our Visitor

040935
Total views : 212440

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: