జిల్లా కలెక్టర్లతో రేవంత్ రెడ్డి కీలక భేటీ..

Revanth reddy

Advertisements

&NewLine;<p>డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు&period; ఈ మేరకు సెక్రటేరియట్ లో వివిధ జిల్లాల కలెక్టర్లు&comma; ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు&period; నిరుపేదలు&comma; అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలన యంత్రాంగాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు&period; అందుకే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు&period; ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామసభలు చేపడుతారు&period; రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు&comma; మున్సిపల్ వార్డుల్లో రోజుకు రెండు చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది&period; ప్రజాపాలన కార్యక్రమానికి సర్పంచ్&comma; స్థానిక కార్పొరేటర్&comma; కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు&period; గ్రామసభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్ చేస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్