90
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తప్పక అమలు పరిచే అభయ హస్తం పై తొలి సంతకం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫిజికల్లీ డిసేబుల్ మహిళ అయిన రజినికి ఉద్యోగం ఇస్తానని రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం సీఎంగా రజిని ఉద్యోగ నియామక ఫైల్ పై రెండో సంతకం చేసి ఉద్యోగ నియామక పత్రాన్ని దివ్యాంగురాలైన రజినికి అందజేశాడు. దీంతో రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అలాగే రేపు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో రేపు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని. దానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
Read Also..
Read Also..