తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మహిళా బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమన్నారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి చేసిన తప్పా అని ప్రశ్నించారు. వి ఐ-టీడీపీ., జనసేన సోసియల్ మీడియా ఎంత ఘోరంగా., వల్గర్ గా వేధింపులకు గురి చేసి చంపేశారని ఆరోపణలు చేశారు. మహిళను గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
గీతాంజలి చావుకు కారణమైన వారికి కఠినమైన శిక్ష ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించానని తెలిపారు. ఐ-టీడీపీ., జనసేన సోసియల్ మీడియా బుద్ధి తెచ్చుకొని హద్దుల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను చులకనగా చూసే జనసేన టీడీపీ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వార్డ్ మెంబర్ గా గెలవలేని లోకేష్ కు జగన్ తో పోటీ పడే శక్తి లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను ఎదుర్కోలేక అందరూ ఏకమై గుంపుగా వస్తున్నారన్నారు. ఎంతమంది కూటమిగా ఏర్పడిన జగన్ ను అడ్డుకునే శక్తి లేదన్నారు. సీఎం జగన్ దమ్మున నాయకుడని…రెండవ సారి సీఎం అవ్వడం ఖాయమన్నారు.
ఇదిచదవండి : మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి