74
మంత్రాలయంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి ఇరు పార్టీల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో మంత్రాలయంలో లక్ష మందితో బీసీగర్జన నిర్వహిస్తామని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలో అధిక శాతం బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున ఎమ్మెల్యే సీటు ఇరు పార్టీలు బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఇరు పార్టీలను రౌండ్ టేబుల్ సమావేశంలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ శ్రేణులు భారిగా తరలి వచ్చారు.